- Advertisement -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ మూడు రోజుల కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత..ఇది మనీలాండరింగ్ కేసు కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు…రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసును బీజేపీ పెట్టిందన్నారు.
లిక్కర్ స్కాం కేసులో ఉన్న ఒక వ్యక్తి బీజేపీలో చేరారు… మరొకరు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు వీరిద్దరూ బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున విరాళలు ఇచ్చారన్నారు. ఇక కోర్టులో హాజరుపర్చిన అనంతరం కవితను 15 రోజుల రిమాండ్‌కు అప్పగించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.
Also Read:TTD:వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
- Advertisement -