MLC Kavitha:త్వరలోనే కేసీఆర్ కోలుకుంటారు

53
- Advertisement -

గురువారం అర్థరాత్రి ఫాం హౌస్‌లో కాలు జారి కిందపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. దీంతో వెంటనే ఆయన్ని సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. కేసీఆర్‌ని పరిశీలించిన మంత్రులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read:రేణు దేశాయ్ పై బ్యాడ్ హెడ్డింగ్స్

 

ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని… కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.

అర్థరాత్రి కాలికి పంచె తగలడంతో, కేసీఆర్ కాలు జారి పడినట్లు తెలుస్తోంది.–విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్‌ కుటుంబంతోపాటు హరీష్‌రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. వైద్యులతో మాట్లాడిన తర్వాత.. కాసేపట్లో చేయబోయే వైద్య పరీక్షలపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌కి యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ వైద్యులు టెస్ట్‌లు చేసిన తర్వాత హెల్త్‌ బులెటిన్‌ ఇస్తారని తెలుస్తోంది.

- Advertisement -