బీసీ రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 4, 5, 6వ తేదీల్లో దీక్ష చేపడతానని తెలిపారు. బీసీ బిల్లు అవసరంపై గాంధేయవాద పద్దతిలో నిరసన తెలుపుతాం అన్నారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రభుత్వ అనుమతికోరి నిరాహారదీక్ష చేస్తాం.. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్షకు దిగుతానని అన్నారు. 2018 పంచాయతీ రాజ్ సవరణ చట్టాన్ని సవరణ చేస్తూ తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసిందని చెప్పారు.
తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఒప్పందంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫీషియల్ గా అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకెళ్లాలి…. అఖిలపక్షం ఢిల్లీకి రావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయండి అని మంత్రి పొన్నంకు సూచించారు కవిత.
Also Read:కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్..!

