ఎస్సీ,ఎస్టీలపై కేంద్రం వివక్ష..

22
- Advertisement -

ఎస్సీ, ఎస్టీలపై కేంద్ర వివక్ష చూపుతోందన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. హన్మకొండలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ పీఎం సీతారాం నాయక్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన..కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని విమర్శించారు.

దళిత మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తమవ్వాలని సూచించారు. కులమతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతున్నదని ఆరోపించారు. 1961 నుంచి 2021 వరకు ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను పెంచలేదని వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం వైఖరి అసమానతలను పెంచేలా ఉన్నదని ఫైరయ్యారు.

తెలంగాణ మోడల్‌గా దేశవ్యాప్తంగా దళిత, గిరిజన బంధు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -