బండి నీకు దమ్ముంటే పీఎం ఇంటిముందు ధర్నా చెయ్- కడియం

124
- Advertisement -

పొడు భూముల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి అవగాహన లేకుండా మాట్లాడుతూన్నాడని, అటవీశాఖ భూములు కేంద్ర ఆధీనంలో ఉంటుందని, నీకు దమ్ముంటే కేంద్రప్రభుత్వంపై ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చెయలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా హరిత హోటల్ ఎంపీ దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో షెడ్యూలు తెగల వారి కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బండి సంజయ్ నీకు అవగాహన ఉంటే మాట్లాడు.. కులమతలను రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నావ్..తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కడియం శ్రీహరి.

- Advertisement -