రెబెల్ స్టార్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన మెగాస్టార్‌..

94
- Advertisement -

గురువారం రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రెబల్‌ స్టార్‌కు విషెస్‌ తెలిపారు. ‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబెల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అడుగిడిన ప్రతి రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన శ్రీ కృష్ణంరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొంటూ.. ‘హ్యాపీ బర్త్ డే కృష్ణంరాజు గారు’ అంటూ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు.

- Advertisement -