కేంద్రంపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్‌..

23

నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం సేకరణపై కేంద్రం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను శవ యాత్ర చేసి కనకదుర్గమ్మ గుడి ఆవరణలో దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ గుత్తా మీడియాతో మాట్లాడారు. 7 సంవత్సరల కాలంలో మోడీ ప్రభుత్వంలో ఎన్నో వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తెచ్చారు. ఈ వ్యవసాయ వ్యతిరేక చట్టాల వల్ల మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ లకు కట్టబెట్టాలనే దురలోచనతో ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఢిల్లీలో గత సంవత్సరంన్నర కాలంగా రైతాంగం మొత్తం చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని చేసిన మూడు నల్ల చట్టాలను రద్దు చేశారు. ఇంకా రెండు చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. కరెంటు చార్జీలను పెంచాలని,వ్యవసాయ దారిలో కరెంటు మీటర్లు పెట్టాలనే ఒక చట్టాన్ని కేంద్రం తెస్తుంది. ఆ చట్టాలను పార్లమెంటు సమావేశంలో ఉపసంహరణ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రాంతానికి సంబంధించి యాసంగిలో పండే పంట మనందరికీ తెలుసు బాయిల్డ్ రైస్ అవుతుందని,నూకలు ఎక్కువ వస్తవి. కాబట్టి నుక తగ్గించాలి అంటే బాయిల్డ్ రైస్ చేయాలి. తెలంగాణలో పండే యాసంగి పంట మొత్తం కూడా ఈరోజు బాయిల్డ్ రైస్ కొనం అని కేంద్రం కచ్చితంగా చెప్తుంది. సీఎం కేసీఆర్ రెండు పర్యాయాలు కేంద్రానికి ప్రధాన మంత్రి, అమిత్ షా, వ్యవసాయ, సివిల్ సప్లయ్ మంత్రులకు కలిసి రిప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయదారులకు సంబంధించి తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో మొండి వైఖరి వ్యవహరించింది. కావాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కక్ష్య పురితమైన వైఖరి వ్యవహరిస్తోంది. రాష్ట్రాలకు వుండే అధికారం రాష్ట్రంకు ఉంటుంది,కేంద్రంకు వుండే అధికారం కేంద్రంకు వుంటుంది. కానీ రాష్ట్రానికి ఉండే అధికారాన్ని కేంద్రం ఒక్కొక్కటి లాక్కోవాలి చూస్తుందని అన్నారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి.