తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి..

329
- Advertisement -

తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా భూపాల్‌రెడ్డి నియమితలయ్యారు. ప్రొటెం చైర్మన్‌గా భూపాల్‌రెడ్డిని నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో నేటితో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. తమ పదవీ కాలం ముగిసిన వారిలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, సభ్యులు కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌, వెంకటేశ్వర్లు పదవీకాలం ముగిసింది.

ప్రస్తుత ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త ఛైర్మన్ ఎన్నికయ్యే వరకు ప్రోటెమ్ స్పీకర్ భాధ్యతలు నిర్వహించనున్నారు. మండలి ప్రొటెం స్పీకర్‌గా భూపాల్ రెడ్డిని నియమిస్తూ గవర్నర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుండి ఇయన చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

- Advertisement -