టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్సీ భాను ప్రసాద్. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన భాను ప్రసాద్…లక్ష్మణ్ చేసిన కామెంట్స్ గల్లీ లీడర్ చేసిన మాటల్లా సంస్కారహీనంగా దిగజారుడుగా ఉన్నాయని మండిపడ్డారు.
లక్ష్మణ్ తాను ఎన్నికల్లో ఓడిపోయాననే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మరోసారి ఇలా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ది చెబుతారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 30 వేల కోట్ల రూపాయల నుంచి భారీ గా పెంచారని నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 30వేల కోట్ల రూపాయలు గా ప్రతిపాదించారని నడ్డా అంటున్నారు ..ఆయనకు ఈ సంగతి ఎవరు చెవిలో చెప్పారని ప్రశ్నించారు ?
బీజేపీ నేతలకు చేతనైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మూడేళ్ళలో పూర్తి చేసి చూపించండని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు వొట్టిమాటలు ,ప్రగాల్భాలు మాని తెలంగాణ కు గట్టి మాటలు తల పెట్టె పనులు చేయండని హితవు పలికారు. నడ్డా మీటింగ్ కు ఓ నియోజకవర్గ టీఆర్ఎస్ మీటింగ్ కు వచ్చిన జనం కూడా రాలేదన్నారు. టీఆర్ఎస్‌కు నిద్రలేని రాత్రులు కాదు …బీజేపీ కి మరో 20 ,30 యేండ్లు రాష్ట్రం లో నిద్ర లేని రాత్రులు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు దమ్ముంటే తమ చేతి లో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించుకోవచ్చన్నారు.
బీజేపీ నేత లక్ష్మణ్ మాజీ ఎంపీ కవిత నుద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్. లక్ష్మణ్ తాను మాట్లాడే తీరు ను మార్చుకుంటే మంచిదని హెచ్చరించారు. కాంగ్రెస్ ,బీజేపీ లు కుమ్మక్కవ్వడం వల్లే నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోయింది …కవిత కు నిజామాబాద్ లోనూ తెలంగాణ ,అంతర్జాతీయంగా ఆదరణ ఏ మాత్రం తగ్గ లేదన్నారు. ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌దే …భవిష్యత్ లో అదే జరుగుతుంది …బీజేపీ ఒక్క ఎమ్మెల్యే తోనే ఎగిసెగిసి పడుతోందని స్ధాయిలేని నేతలే ఆ పార్టీలో ఉన్నారని మండిపడ్డారు.