బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్

1421
- Advertisement -

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ బేరసారాల బాగోతం బట్టబయలైంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ మధ్యవర్తి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..  ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో  న రామచంద్రభారతి స్వామి, నందకుమార్‌లు మాట్లాడిన ఆడియో కాల్ బయటకు లీకైంది.

‘బీజేపీలోకి రావడానికి నేను క్లియర్ చేస్తాన్నా. బీజేపీలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న వ్యక్తులతో నేను మాట్లాడిస్తా. ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా నేను చూసుకుంటా.’ అని రామచంద్రభారతి మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నందు మీద తాము ఒత్తిడి పెట్టామని, అందుకే అతను రోజూ మీకు కాల్ చేస్తున్నారంటూ స్వామిజీ చెప్పినట్లు ఆడియోలో ఉంది. గత కొంతకాలంగా నందు నిద్రపోవడం లేదని, ఇదే పనిలో ఉన్నారంటూ స్వామిజీ తెలిపారు. దాదాపు 15 నిమిషాల పాటు ఉన్న ఈ ఆడియోతో బీజేపీ నీచ రాజకీయాలకు అద్దపడుతోంది.

ఇవి కూడా చదవండి

అమిత్ షాతో ప్రమాణం చేయించగలరా?

సోషల్‌ మీడియాను కట్టడి చేద్దాం:మోదీ

జనవరిలో అందుబాటులోకి స్కైవాక్

- Advertisement -