బిజెపి కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వివేకానంద్.. కాంగ్రెస్ బిజెపి మైత్రి నిన్న అసెంబ్లీలో బయటపడింది అన్నారు. బిజెపి కాంగ్రెస్ రెండు బాహటంగానే ఒప్పందం చేసుకొని బిఆర్ఎస్ పై దాడి చేస్తున్నారు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడినప్పుడు బిజెపి వారికి స్క్రిప్ట్ ఇచ్చి వారితో టిఆర్ఎస్ పై దాడి చేయిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే సభలో బిజెపి ఎమ్మెల్యేలు… బయట కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది.. అలాంటిది బిజెపి ఎమ్మెల్యే ఇక్కడ సభలో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఢిల్లీలో కేంద్రం ఇచ్చిన అనుమతులు తప్పు పడుతున్నారా….బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ భాష మాట్లాడేకన్నా ఆ పార్టీలో విలీనం అయితే మంచిది అని చురకలు అంటించారు.
Also Read:రాజేంద్రప్రసాద్ కామెంట్స్‌పై వార్నర్!