కొత్తగూడెంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే వనమా

473
mla vanama
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ రూపొందించిన హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారం ఆశయంగా హరిత తెలంగాణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ బీజం వేసిన గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటినట్లు వనమా వెంకటేశ్వరరావు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పి, జిల్లా అధికారి కి గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు,టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

mla vanama venkateshwarrao plan saplings at kothagudem mla camp office. mla vanama venkateshwarrao plan saplings at kothagudem mla camp office.

- Advertisement -