రాజయ్య తల్లి మృతి…సీఎం కేసీఆర్ సంతాపం

125
mla
- Advertisement -

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి ల‌క్ష్మి (87) కొద్దిసేపటి క్రితం మరణించారు. హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(RMH) లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

ఎమ్మెల్యే రాజ‌య్య మాతృమూర్తి ల‌క్ష్మి మృతిప‌ట్ల సీఎం కేసీఆర్, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంతాపం వ్య‌క్తం చేశారు. రాజ‌య్య కుటుంబానికి సీఎం, మంత్రి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు.

- Advertisement -