మొక్కలు నాటిన ఎమ్మెల్యే శంకర్ నాయక్..

39
MLA Shankar Nayak

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఈరోజు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పకృతిని మనం సంరక్షించితే అది మనల్ని కాపాడుతుంది అని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన క్యాంపు కార్యాలయంలోనే మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.