నేడు మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు పరిసర ప్రాంతాల్లో గ్రీన్ ఇండియాలో భాగంగా కలెక్టర్ శివలింగయ్య ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ స్వీకరించి మొక్కలు నాటారు. అనంతరం ఆయన ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకి, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్ కుమార్‌కి మరియు మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఛాలెంజ్‌ను విసిరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. రామాయణ, మహాభారత కాలాల్లో మనుషుల సగటు జీవన పరిమితి రెండు వందల ఏండ్ల పైన్నే ఉండేదని చదువుకున్నాం. పాండవులు, శ్రీకృష్ణుడు రెండు వందలేండ్లకుపైనే బతికారని మహాభారతంలో ఉన్నది. ఆ కాలంలో వాళ్ళు ప్రకృతిలో ప్రకృతిలా జీవించారు. కాలుష్యం లేని చల్లని గాలి.. ఊట, సరస్సుల నీరు, ప్రకృతి సిద్ధమైన ఆహారం తినడమే. ఈరోజు పరిస్థితి పూర్తిగా మారింది. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి.
పల్లెలు పచ్చబడాలి. అన్నదాత తలెత్తుకుని బతకాలి. ఇదంతా జరగాలంటే పచ్చదనాన్ని పెంచడమొక్కటే మార్గం. ఇది ప్రభుత్వమో అధికారులో చేస్తే పూర్తయ్యే పని కాదు. తెలంగాణను బాగుచేసుకోవాలనుకునే ప్రతీ మట్టి బిడ్డ ఇందులో భాగస్వాములు కావాలి. అలా తెలంగాణను మొత్తం సస్యశ్యామలం అయ్యే వరకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి అని ఎమ్మెల్యే అన్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు, అందులో నేను భాగమైన అయినందుకు గర్వపడతున్న… ఈ ఛాలెంజ్ విసిరిన కలెక్టర్ శివలింగయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని శంకర్ నాయక్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపాటు డీఎఫ్ఓ, డీఎస్పీ ,మున్సిపల్ కమిషనర్ మరియు పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులు పాలుపంచుకొని మొక్కలు నాటారు.
దీనిపై ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించి.. గ్రీన్ ఛాలెంజ్ లో కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు అలాగే మరికొందరిని ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరినందుకు మహబూబాబాద్ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు అని ఎంపీ సంతోష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Thank you @MLAShankarTRS garu for accepting #GreenIndiaChallenge and planting saplings. 🌱🌳. https://t.co/mni2BHHXoR
— Santosh Kumar J (@MPsantoshtrs) November 20, 2019
MLA Banoth Shankar Naik Accepted Green Challenge By MP Santosh Kumar, He Planted Three Saplings..