సైదిరెడ్డికి సర్టిఫికేట్ అందించిన ఈసీ..

514
MLA Saidi reddy
- Advertisement -

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. శాసనసభ్యులుగా శానంపూడి సైదిరెడ్డి గెలుపొందిన ఆయనకు ఎన్నికల కమిషన్ సర్టిఫికెట్ అందించింది.

ఈ సర్టిఫికెట్‌ను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సచీంద్ర ప్రతాప్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి డి.అమయ్ కుమార్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి. చంద్రయ్యలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పల్లా రాజేశ్వర రెడ్డి, కోదాడ, తుంగతుర్తి, నల్లగొండ శాసనసభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -