అమ్మవారి సేవలో ఎమ్మెల్యే రోజా..

20

తిరుపతిలోని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఈ కార్యక్రమంలో ఏఈవో ప్రభాకర్ రెడ్డి సూపర్డెంట్ మధుసూదన్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.