సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన రోజా

638
cm kcr roja
- Advertisement -

ఏపీలో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. తమిళనాడులోని కంచి అత్తివరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న సీఎంకు నగరి ఎమ్మెల్యే రోజా ఘనస్వాగతం పలికారు.

రేణిగుంట నుంచి రోడ్డు మార్గన కంచికి చేరుకోనున్నారు సీఎం కేసీఆర్. కుటుంబ సమేతంగా అత్తివరదరాజు స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం.

అత్తివరదర్ స్వామి ఆగస్టు 17వరకు మాత్రమే దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన్న చూసి తరించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో కంచి పట్టణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

- Advertisement -