పాక్ లో చికెన్ కంటే టమాట రేటే ఎక్కువ

488
Pakistan Tomoto
- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ పాక్ కు మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో కశ్మీరీలకు సంఘీభావం ప్రకటిస్తూ భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్నారు ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయం ఫలితం ఇప్పుడు వారికి తెలిసివస్తోంది. ఇండియా నుంచి ఎగుమతి కావాల్సిన అనేక వస్తువులు ఆగిపోయాయి. కూరగాయలను ఎక్కువగా ఇండియా నుంచి పాకిస్ధాన్ దిగుమతి చేసుకుంటుంది.

అయితే ఇప్పుడు ఇండియా సంబంధాలు లేకపోవడంతో పాకిస్ధాన్ లో టమాటో ధర చికెన్ ను మించిపోయింది. వారం క్రితం పాకిస్ధాన్ లో కిలో టమాటో రూ.30 ఉండగా..ప్రస్తుతం కిలో టమాటో ధర రూ.300 ఉంది. టమోటా, ధరలు కొండెక్కడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతవారం కిలో ఆలుగడ్డ రూ.10 ఉంటే.. ఇప్పుడది రూ.30కి చేరింది. మరికొన్ని రోజులు దాటితే అసలు కూరగాయలే దొరకని పరిస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -