గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన ఎమ్మెల్యే రోజా..

386
roja

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరియు బిగ్ బాస్ షో ఫేమ్ భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరి పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించి పీసీఎన్‌ హైస్కూల్ ఆవరణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

రోజా

సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు సంతోష్‌ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అందరం మొక్కలు పెంచాలని కోరారు. దాని వల్ల భారతదేశం మన తెలుగు రాష్ట్రాలు ఆకుపచ్చగా మారుతాయని అని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరం తీసుకోవాలి పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులకు మొక్కలు పంచిపెట్టడం జరిగింది.