గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలునాటిన ఎమ్మెల్యే రాములు నాయక్‌

195
ramulu naik
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌. ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడు గ్రామం లో నేనున్నా మహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాములు నాయక్‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందు సాగుతుందని గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటపతి రాజు గారు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ గారు, ఎస్సై సురేష్ గారు, గ్రామ సర్పంచ్ కోట ఎలీషా గారు, ఎంపీటీసీ మాగంటి సుందరమ్మ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి మోహన్ రావు గారు, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళ పాటి సీతారాముల గారు, నేనున్న మహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు మేరుగు మానస, ఉపాధ్యక్షురాలు వెంపటి రూతు, ప్రధా నా కార్యదర్శి బొల్లె పోగు త్రివేణి, కోశాధికారి మాతంగి మౌనిక, మేరుగు రత్నరాజు, శ్రీనాధుని గిరి,మాతంగి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -