ఎమ్మెల్యే రాజగోపాల్..సెన్సేషనల్ కామెంట్స్

8
- Advertisement -

నేను మునుగోడు ఎమ్మెల్యేను.. యాదాద్రి జిల్లాలో నా మునుగోడు నియోజకవర్గం ఉంటది… యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం లేదు అని మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇది ఒన్సైడ్ నిర్ణయం. అస్సలు కరెక్ట్ కాదు అని ఓ ఛానల్ మార్నింగ్ లైవ్ ప్రోగ్రాంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నన్ను అడిగితే మా నియోజకవర్గం నుంచి ఒక మెంబర్ అయినా వేయించుకునే వాణ్ణి. ఇలా చాలా దారుణంగా బిహేవియర్ ఉంటే చాలా కష్టం. చైర్మన్ విషయం నేను మాట్లాడుకో దలుచుకొలేదు. కానీ మెంబెర్ విషయమైన చెప్పాలి కదా. ఆ మాత్రం ఇంగితజ్ఞానం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ ఖర్మ…సీఎం కు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నా… రాహుల్ గాంధీని కలిసిన… కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ చేస్తున్నే ఉన్నా…పార్టీ పరంగానే ఉన్నాం. ఇటువంటి అప్పుడు మాకు అవకాశం ఇస్తే బాగుంటది. చాలా దారుణం ఇది అన్నారు.

అందరూ సీనియర్ లీడర్స్ ఉన్నారు. పార్టీ ఎట్లా నడపాలో తెలిసినోళ్లే. నియామకాలు ఎలా చేయాలి. సీనియర్ లీడర్స్ ని ఎలా గౌరవించాలో తెల్వదా వాళ్లకి…కాంగ్రెస్ లో అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, ఒరిజినల్ గా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అందరూ రోజురోజుకి కనుమరుగు అయిపోతున్నారు. కొత్త బ్యాచ్ ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చారు. అంతా కొత్త వాళ్ళేదే నడుస్తోందన్నారు..

ఏది ఉన్నగాని ప్రభుత్వం అనేది ప్రజల కోసం పని చేయాలి. కానీ షో అప్స్ చేస్తే, ఎక్కువ మాట్లాడితే ప్రజలకు నచ్చదు. హంగామా చేస్తే ప్రజలకు నచ్చదు.నల్లగొండ సీఎం మీటింగ్ కు పోబుద్ది కాలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నచ్చక పోలేదు. వాళ్ళ వ్యవహారశైలి అస్సలు బాలేదు. నాకు నచ్చడం లేదు.మా బ్రదర్ వెంకట్ రెడ్డి… నా గురించి దానాకర్ణుడు అని పాజిటివ్ గానే మాట్లాడాడు. మంచి ఉద్దేశంతోనే అన్నాడు అన్నారు.

Also Read:పవన్‌తో పూజా హెగ్డే రొమాన్స్!

- Advertisement -