పారిశ్రామిక రంగానికి భారీ ఊరటనిస్తూ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 183.50 తగ్గించాయి. ఈ నిర్ణయం వల్ల రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు మరియు ఆహార, పానీయాల వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద ఉపశమనం లభించనుంది. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొత్త ధరలు నేటి నుండి అమలులోకి వచ్చాయి.
అంతకుముందు జూన్ 25న కేంద్ర ప్రభుత్వం నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్‌పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాలవారీ ఆంక్షలను తొలగించి, పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు ఉన్న స్థాయికి సరఫరాను పునరుద్ధరించింది. తాజా తగ్గింపు తర్వాత 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,930 కి చేరింది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ (గృహ వినియోగ) ఎల్‌పీజీ సిలిండర్ ధర ఎటువంటి మార్పు లేకుండా రూ. 942 వద్దే కొనసాగుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ దాడుల తర్వాత, ఇరాన్ తన ఆధీనంలో ఉన్న ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ ( ద్వారా ముడిచమురు, గ్యాస్ తీసుకెళ్లే నౌకల రాకపోకలను అడ్డుకుంది. ఈ సరఫరా అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, మరియు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి.
Also Read:పవన్‌తో పూజా హెగ్డే రొమాన్స్!

