శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్..

5
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. ఇవాళ ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేస్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు.

కూటమి విజయం సాధించాలనే తన కోరిక నెరవేరిందన్నారు. ఉండి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించినందుకు స్వామి వారిని దర్శించుకున్నాను అని చెప్పారు. గత ప్రభుత్వ బాధితులందరి తరఫున స్వామి వారికి కృతజ్ఞతలు తెలిపాను అని వెల్లడించారు.

అనకాపల్లిలో భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారన్నారు సీఎం రమేష్. కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయడంతో స్వామివారిని దర్శించుకున్నా అని చెప్పారు.

Also Read:రాజ్యసభకు చిరు

- Advertisement -