బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిరసన..

46
- Advertisement -

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికారుల పక్షపాత వైఖరి పట్ల నిరసన తెలియజేస్తూ దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కార్యాలయం ముందు దుబ్బాక నియోజకవర్గం బీజేపీ సర్పంచ్ లు,ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో కలిసి నిరసనకు దిగారు. కేంద్రం ప్రభుత్వం జాతీయ నిధుల నుండి ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులు మంజూరు చేసింది.. కానీ దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం కేవలం టీఆర్ఎస్ సర్పంచ్‌లకు నిధులను కేటాయించి బీజేపీ పార్టీకి చెందిన సర్పంచ్‌లకు కేటాయించకపోవడం పట్ల జిల్లా అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రఘునందన్ రావు.

కేంద్రంనుంచి 53 కోట్ల నిధులు వస్తే మాకు కేవలం 3 కోట్ల నిధులు ఏ విధంగా కేటాయించారని నిలదీశారు. రెండు మూడు నెలలు గడుస్తున్నా సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ లేడని కనీసం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తాం అని వస్తే అధికారులు ఎవ్వరు కార్యాలయంలో లేరు,ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు రూపాయలు వెచ్చించి కలెక్టరేట్ కార్యాలయం కడితే ఇక్కడ కలెక్టర్ ఉండడు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండరని ఇలా ఐతే ప్రజల సమస్యల్ని ఎవరికి చెప్పుకుంటారని ఎమ్మెల్యే రఘునందన్ రావు నిలదీశారు.

- Advertisement -