కేటీఆర్‌కు వినూత్నంగా బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఎమ్మెల్యే..

133
- Advertisement -

ఐటీ మరియు పురపాలక శాఖామాత్యులు,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు జన్మధినం సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 100 అడుగుల్లో హరిత కానుకను అందజేసారు..ముక్కోటి వృక్షార్చణ కార్యక్రమానికి మద్దతుగా,కేటీఆర్ జన్మధినం సందర్బంగా ముందుగానే ఖిలా వరంగల్ లోని గ్రౌండ్‌లో కేటీఆర్ రూపాన్ని 100 అడుగుల్లో హరిత ఆర్ట్ (గ్రీన్ ఆర్ట్ ) రూపొందించి.. జన్మదిన సందర్బంగా ఎమ్మెల్యే తన ప్రేమను చాటుకున్నారు..కేటిఆర్‌పై ప్రేమతో రూపొందించిన సీడిని ఆవిష్కరించారు.

యువనేత మాకు మార్గదర్శకుడు మంత్రి కేటీఆర్ జన్మధినం సందర్బంగా హరిత కానుకను అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం రూపొందించామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.అపదొస్తే వెంటనే స్పందించే దయాగుణం కలిగిన కేటీఆర్ ఐటీ,పురపాలనను కొత్తపుంతలు తొక్కించాలన్నారు. ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపారన్నారు. వరంగల్ నగర అభివృద్దికి వారు ప్రత్యేక శ్రద్దతో కృషి చేస్తున్నారన్నారు. వారిపై ప్రేమతో ఇలా వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపామని ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -