గ్రీన్‌ ఛాలెంజ్‌కు మంచి స్పందన..

22
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ 2023 విన్నర్స్,రన్నర్స్. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.యువత ఈ కార్యక్రమంలో పాల్గొని దేశ మంతా పచ్చదనం పెంచేలా కృషి చెయ్యాలి అని అన్నారు.ఇంత గొప్ప కార్యక్రమం లో భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుహాసిని పాడ్యం,రుషీనా, విన్నర్ మిస్టర్స్ ఇండియా, దేవి మిస్ ఇండియా విన్నర్, ఆకాంక్ష బేల్వాన్షి ,మిసెస్ ఇండియా విన్నర్, బిందు భరత్ తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని తన పుట్టినరోజు సందర్బంగా వారి నివాసంలో మొక్కలు నాటారు పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి. పుట్టినరోజు సందర్బంగా మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి KCR గారు రాష్టంలోని ప్రజలందరిని కంటికి రెప్పలా కాపాడుతూ, అన్ని వర్గాల వారికి లబ్ది పొందే దిశగా పనిచేస్తుంది అన్నారు. తెలంగాణ రాష్టంలో ఎలా అయితే అభివృద్ధి జరుగుతుంది అది దేశ మంతా జరగాలంటే తప్పకుండా KCR అవసరం దేశానికి ఎంతో ఉంది అన్నారు. సందర్బం ఏది అయినా అందరూ మొక్కలు నాటాల్సిన అవసరం అందరి మీద ఉంది అన్నారు. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు. చిట్టి రెడ్డీ రాంరెడ్డి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -