మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా….

1534
manchireddy kishanreddy
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రోజుకు 1500ల వరకు కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు 49 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారీన పడ్డారు.

తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అపోలో ఆస్పత్రిలో చేరారు కిషన్ రెడ్డి. ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డితో ఎవరెవరూ సన్నిహితంగా ఉన్నారో అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇప్ప‌టికే డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స‌హా ప‌లువురు ఎమ్మెల్యేలు క‌రోనాబారిన‌ప‌డి కోలుకోగా.. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సైతం కరోనా బారీన పడగా ఆయన కూడా చికిత్స పొందుతున్నారు.

- Advertisement -