లాక్ డౌన్‌లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి..

521
- Advertisement -

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నేడు జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని షేక్ పేట్ డివిజన్‌లో బృందావన్ కాలనీ, సూర్య నగర్ కాలనీల్లో కరోనా నియంత్రణ పనులను పరిశీలించి, స్వయంగా మందు స్ప్రే చేశారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర్లో ప్రజలకు కరోన వ్యాధి వ్యాప్తి ప్రబలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

లాక్ డౌన్‌లో ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి సహకరించాలి. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల ప్రజలను తన సొంత బిడ్డలా చూసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భోజనానికి ఇబ్బంది పడకుండా తమ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు. అని ఎమ్మెల్యే తెలిపారు.

నియోజకవర్గంలో ఇప్పటికే కూరగాయల మార్కెట్లను సందర్శించాను ఎక్కడ కూడా అధిక రేట్లు అమ్మడం లేదు.నిత్యవసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 14 వరకు ఇలాగే లాక్ డౌన్‌లో పాల్గొనాలి అని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -