జమ్మి చెట్టును నాటిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్..

122
MLA KP Vivekanand
- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు’లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని కాలనీ వాసులతో కలిసి జమ్మి చెట్టును నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాగానే రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారమని, జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం మన ఆనవాయితీ అని అన్నారు.

ఈ ప్రాధాన్యతల దృష్ట్యా రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు-గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టడం హర్షదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో కాలని అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, జెనరల్ సెక్రెటరీ రాజేష్, కల్పన, ప్రహల్లాధ్, అనీష్, చైతన్య, వీరా రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శివానంధ్, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -