సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం రాసలీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేశారు చంద్రబాబు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆదిమూలం. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన బాధితురాలు..తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని ఆరోపించింది. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని..జూలై 6న తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.
ఈ విషయాన్ని గతంలోనే సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది. తనకు ఆదిమూలం నుంచి ప్రాణ హాని ఉందని తెలిపింది. సీఎం స్పందించి న్యాయం చేయకపోతే టీడీపీ ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొంది.
Also Read:సిద్దిపేట నుండి ఖమ్మంకు నిత్యావరసర సరుకులు..
టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసిన చంద్రబాబు గారు. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో తీవ్ర చర్యలు తీసుకున్న చంద్రబాబు గారు.#AndhraPradesh pic.twitter.com/M2SsRGOoQJ
— Telugu Desam Party (@JaiTDP) September 5, 2024