రైతు భరోసా, రైతుబీమా పథకాలు ఎక్కడ అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన కౌశిక్..కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు.
అక్రమ కేసులతో కేటీఆర్‌ను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు ప్రపంచ దేశాలు పోటీపడతాయని చెప్పారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు రేసు నిర్వహణకు పోటీపడ్డాయి. కేటీఆర్ ఎంతో కష్టపడి హైదరాబాద్‌లో ఈ రేసును నిర్వహించారని తెలిపారు.సీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావులను అరెస్టు చేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని రేవంత్ చూస్తున్నారని ఆరోపించారు.
సంజయ్ కుమార్ కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయాడని, అందుకే నీది ఏ పార్టీ అని అడిగానని చెప్పారు. మా బట్టలు విప్పుతామంటే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని అధికారుల సమక్షంలో చెప్పిన సంజయ్ కుమార్‌ను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు లేవని, పీడీ యాక్ట్ ఎలా పెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు.
Also Read:సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..