- Advertisement -
పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ(పీయూసీ) ఛైర్మన్‌గా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యేకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీయూసీ సభ్యులుగా ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టీ ప్రకాశ్‌గౌడ్, వీఎం అబ్రహం, బీ శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, సయ్యద్ అహ్మద్ బాషా ఖాద్రీ, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్, టీ జీవన్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్ నియమితులైన విషయం తెలిసిందే.
- Advertisement -