తెలంగాణ టీడీపీ ఆఫీస్ కు రేవంత్ రెడ్డి చప్రాసి:జీవన్ రెడ్డి

181
jeevan
- Advertisement -

తెలంగాణ టీడీపీ ఆఫీస్ కు రేవంత్ రెడ్డి షప్రాసి కాదా? అని ప్రశ్నించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే,పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి. టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు , ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి లఫంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రేస్ కి రేవంత్ రెడ్డి నిన్నగాకమొన్న వచ్చాడు…. 75 ఏళ్లుగా దేశాన్ని దోచుకుంది గాంధీ కుటుంబం అని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వలేదు అనే కాంగ్రెస్ మాటలను ఖండిస్తున్నామని తెలిపారు.

వడ్డీలేని రుణాలను మహిళలకు వేలకోట్లు ఇచ్చాము…రేవంత్ కి టీపీసీసీ అధ్యక్షుడుగా ఉద్యోగం ఇచ్చిందే కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. నిన్న సభలో రేవంత్ రెడ్డి చదువులేని సన్నాసి లాగా మాట్లాడారు… దళితులకు విద్యను దూరం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. జానారెడ్డి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్న మాటలు ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం ఏంటో కానీ రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం అన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడంలో నెంబర్ వన్… కేసీఆర్ ఒక్క సైగ చేస్తే మూడు పిట్ల రేవంత్ రెడ్డి గాలికి కొట్టుకుపోతారన్నారు. రేవంత్ దుకాణం పెద్దమ్మ టెంపుల్ దగ్గరేనని మండిపడ్డారు.

రాజకీయ నేతల భాష చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. రాజకీయ నేతల భాష రాష్ట్ర యువతకు- ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నామో తెలపాలన్నారు. 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రేస్ నేతలు రేవంత్ రెడ్డి భాష చూసి అచ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. దళితబంధును చూసి ఎందుకు బీజేపీ- కాంగ్రేస్ భయపడుతోందని… ఇన్ని ఏళ్లలో దళితుల అభివృద్ధి కోసం ఎవరైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు.

ప్రింటింగ్ ప్రెస్- గోడలమీద రాతలు రాసే రేవంత్ రెడ్డి వేల కోట్లకు ఎలా ఎదిగారు? అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలోనే ఉంటుందని… తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను కాంగ్రెస్ అడ్డుకునే కుట్ర చేస్తోందన్నారు. నా నియోజకవర్గంలో జరిగిన విషయంలో హెచ్‌ఆర్సీ కలుగజేసుకోవాలన్నారు. ఔట్ డేటెట్ నేతలు- బజానపరులు మాత్రమే రేవంత్ వెంట ఉన్నారు… మేమే గనుక మా శక్తిని ఉపయోగిస్తే- గజ్వెల్ లో కాలుకూడా పెట్టలేవన్నారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు ఎందుకు వదులుకోవడం లేదు?… దళితబంధు పై ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించిందన్నారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే గజ్వేల్ సభను అడ్డుకుంటాం అని హెచ్చరించారు.

- Advertisement -