నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు రైతులను మోసం చేశాడన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి. పసుపు బోర్డు స్ధానంలో స్పైస్ బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి పియుష్ గోయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా జీవన్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న కాఫీ, రబ్బర్, తేయాకు బోర్డుల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు కావాలని కోరామని.. కానీ స్పైస్ బోర్డును కోరలేదని అన్నారు.
తాను ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని చెబితెనే రైతులు బీజేపీకి ఓటు వేశారని కానీ..ఇప్పుడు స్పైస్ బోర్డుతో బీజేపీ నాయకులు రైతులను మోసం చేశారన్నారు. స్పైస్ బోర్డు కొత్తగా ఏర్పాటు చేసింది కాదు. గతంలోనే వరంగల్‌లో స్పైస్ బోర్డు ఏర్పాటు చేశారు. పైగా స్పైస్ బోర్డు వల్ల ఏమి ప్రయోజనం లేదన్నారు. ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట తప్పి ఇప్పుడు కేంద్రంతో ఒక ఫేక్ జీవో జారీ చేయించాడన్నారు.