బీజేపీ నేతలకు రైతులే గుణపాఠం చెబుతారుః ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

214
trs jeevan reddy
- Advertisement -

బీజేపీ నేతలకు రైతులే గుణపాఠం చెబుతారన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కరోనా వైరస్ కూడా బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు . దేశభద్రత ,కరోనా విషయాల్లో రాజకీయాలు వద్దని సీఎం కెసిఆర్ మోడీ తో వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు.బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ లో ఎక్కువ కేసులున్నాయని అబద్ధాలాడారన్నారు. సోషల్ మీడియా లో బీజేపీ నేతలు తెలంగాణ కరోనా కేసుల పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కరోనా సమయం లోనూ సీఎం కెసిఆర్ రైతుల అకౌంట్ల లో 5 వేల కోట్ల రూపాయలు జమ చేశారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని అన్నారు. కేసీఆర్ రైతుల పాలిట దేవుడు అని చెప్పారు.

ఎంపీ రంజీత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుతం దేశం రెండు సమస్యలు ఎదుర్కొంటుంది. ఒక వైపు కరోనా.. మరో వైపు ఇండో చైనా. ఈ రెండు సమస్యలు కూడా పార్టీలకు అతీతంగా ఎదుర్కోవాలని మా సీఎం కోరినట్లు తెలిపారు. ఐసి ఎమ్మార్ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయం లో ముందుకు వెళ్తుందన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలంగాణ శేబాష్ అంటే.. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శలు చేయడం విడ్డురం అన్నారు. టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లకు కరోనా వచ్చింది అంటే మేము ప్రజల్లో ఉన్నాం అని అర్ధం అని తెలిపారు.

- Advertisement -