సిరుల మాగాణంగా సింగరేణి: జీవన్ రెడ్డి

166
jeevan reddy
- Advertisement -

సింగరేణిని సిరుల మాగాణంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన జీవన్‌ రెడ్డి… 2014లో రూ.12 వేల కోట్లున్న సింగరేణి టర్నోవర్‌ ప్రస్తుతం రూ.25 వేల కోట్లకు చేరిందని గుర్తుచేశారు.

7వేల కోట్లు సింగరేణి టాక్స్ రూపంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుందన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి తెలంగాణ ఏర్పాటు తర్వాత 14వేల ఉద్యోగాలు కొత్తగా కల్పించిందన్నారు. వారసత్వ ఉద్యోగ అవకాశం మళ్ళీ కల్పిస్తోంది…దేశంలో అన్ని సంస్థల కంటే గొప్ప విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు.

ఆరు జిల్లాలో 100 దవాఖానల ద్వారా ఆరోగ్యాన్ని అందిస్తోంది…10 రకాల టాక్స్ లు ప్రభుత్వాలకు సింగరేణి చెల్లిస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి నష్టాల్లో నడిచింది- DMFT నిధులు గతంలో లేవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24వందల కోట్ల నిధులను DMFT కింద వాడుతున్నారని తెలిపారు.

- Advertisement -