మిస్ వరల్డ్ సాధించడమే లక్ష్యం: మానస వారణాసి

54
miss india

మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని సాధించడమే తన లక్ష్యమని మిస్‌ ఇండియా మానస వారణాసి అన్నారు. హోటల్ మ్యారియట్ లో మీడియాతో మాట్లాడిన మానస వారణాసి…మిస్ ఇండియా కావాలన్న నా స్వప్నం నెరవేరింది.. గెలుపును ఆస్వాదిస్తున్నానని తెలిపింది. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దీన్ని గౌరవంగా భావిస్తున్నా అన్నారు. గత పది రోజులు చాలా బిజీగా గడిచాయి.. ఇంకా ఇది కలగానే అనిపిస్తుందన్నారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణం అయినా అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

మిస్‌ ఇండియా ఓ బిగ్‌ చాలెంజ్‌. దానిని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్లాట్‌ఫాం వైపు స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. మా అమ్మానాన్న సైతం ఆ దిశగా ముందుకు నడిపించారని తెలిపారు. ఇప్పుడు వారెంతో సంతోషపడుతున్నారు. ఇండియాను ఇంటర్నేషనల్‌ ప్లాట్‌ఫాంపై నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.