వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన…తెలంగాణ పొలిటికల్ టూరిస్ట్ ప్లేస్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనే మర్రిచెట్టు నాలుగో కొమ్మనే షర్మిల పార్టీ అని.. రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలని అనుకుంటున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలసి పనిచేయవచ్చు కదా ? అని ప్రశ్నించారు. షర్మిల అమిత్ షా వదిలిన బాణామని వెల్లడించారు.
షర్మిల కొత్త పార్టీ పెట్టి తప్పు చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. విభజన తర్వాత ఈ పార్టీల లొల్లి ఎందుకు…మళ్లీ ఉమ్మడి రాష్ట్రం చేయండి అని జగ్గారెడ్డి మండిపడ్డారు.
ఇవ్వాల షర్మిల, రేపు జూనియర్ ఎన్టీఆరో, మరొకరో వస్తారని చెప్పారు. బీజేపీ డైరెక్షన్‌లోనే షర్మిల పార్టీ పెడుతున్నారని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లేకుండా వైఎస్ లేరన్నారు.