రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి మరోసారి ఫైర్..

156
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు నడుస్తోంది. ఆదివారం కాంగ్రెస్ సీనియర్లు అశోక హోటల్‌లో సమావేశం అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెబుతానన్నారు. మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. తనను సస్పెండ్ చేసినా కాంగ్రెస్‌కు, సోనియా, రాహుల్‌కు విధేయుడుగా ఉంటానని, రేవంత్ ఛాలెంజ్ చేస్తే తాను రాజీనామ చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

తన నియోకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటానని జగ్గారెడ్డి అన్నారు. తాను గెలిస్తే హీరోనని, ఇద్దరం ఓడితే జీరోలమేనన్నారు. తనను సస్పెండ్ చేస్తే, రోజుకో బండారం బయట పెడుతానన్నారు. రేవంత్ పార్టీ లైన్‌లో పని చేయడం లేదని, పర్సనల్ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్ షో చేస్తున్నానన్నారు. తన కూమార్తె సమస్యపై వీహెచ్ మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలందరూ ఈరోజు భేటీ అయ్యారు. ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి, మానిక్కం ఠాగూర్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రేవంత్‌ను తొలగించి మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పీసీసీ ఇవ్వాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానం ఏలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -