‘దసరా’.. ఊర మాస్ అవతారంలో నాని..

38
- Advertisement -

నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింఘ రాయ్ విజయం తర్వాత మొద‌టిసారి శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో ‘ద‌స‌రా’ చిత్రం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఆధ్వర్యంలో దసరాను ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.ఇందులో క‌థానాయిక‌గా కీర్తి సురేష్ న‌టించ‌నుంది. ఇక ఈ మూవీ తెలంగాణ కరీంనగర్ జిల్లా గోదావరిఖని సింగరేణి బొగ్గుగని నేపథ్యంలో పక్కా మాసీవ్ అంశాలతో సాగబోతోంది.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయి విడుదల కానుంది. ఊర మాస్ అంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ ఏక కాలంలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపత్యంలో తాజాగా ఆదివారం స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో ఓ వీడియోని విడుదల చేసింది.

ఈ వీడియోలో మండుతున్న ఓపెన్ క్వారీలో టిప్పర్ లలో బొగ్గు లోడ్ చేస్తున్న విజువల్స్ తో వీడియో మొదలైంది. బ్లాక్ కలర్ గల్ల లుంగీ.. రెడ్ షర్ట్ ధరించి చేతిలో బీడీ పట్టుకుని మండుతున్న బొగ్గుతో బీడీని అంటించుకుని.. ముందు రెండు 90 ఎం.ఎల్ బాటిల్స్ తో ఊర మాస్ అవతార్ లో నాని కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

- Advertisement -