నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్య(mbbs)తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఇతర వృత్తులకు వైద్య వృత్తికి చాలా వ్యత్యాసం ఉంది. వైద్యులకు సామాజిక సేవా, స్పుహ, ఆపదలో ఉన్నవారిని కాపాడడం మొట్టమొదటి కర్తవ్యమన్నారు.డబ్బు ఎక్కువగా సంపాదించే వారి కన్నా సోషల్ రెష్పన్స్ వైద్యులకు ఎక్కువగా ఉంటుందని హరీష్ పేర్కొన్నారు.
వైద్యులకు పండగలు అనేవి ఉండవు.డాక్టర్‌గా చదువుకొనే వారికి తొలి అడుగు ఈ రోజు.సమాజానికి సేవా చేస్తా అనే నమ్మకం వైద్యుల్లో ఉండాలి.ప్రజలు డాక్టర్‌లో ఒక దేవుడిని చూస్తారు.జన్మనిచ్ఛేది దేవుడు అయితే, పునర్జన్మ నిచ్ఛేది మాత్రం డాక్టర్. డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి కానీ సామాజిక గౌరవం పొందే గొప్ప అవకాశం వైద్యులకు ఇచ్చాడు భగవంతుడు అని హరీష రావు అన్నారు. విద్యార్థులు గొప్ప వైద్యులుగా పేరు తెచ్చుకోవాలి. ఇక్కడ కళాశాల ఏర్పాటు అనేది ఒక కళ అన్నారు. 2వ బ్యాచ్ ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది.
చాలా మంది తల్లిదండ్రులు సిద్దిపేట మెడికల్ కళాశాలలో చేరడానికి ఉత్సాహం చూపించారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హరీష్ రావు అన్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తాం.. నాణ్యమైన విద్య అందించడం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల15 వరకు నూతన భవనాన్ని ప్రారంభించి, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తాం. మంచి విద్యను అందించి రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి వైద్యులుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.