పద్నాలుగేళ్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. ఈ సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో విస్మరించలేని పేరు హరీశ్‌రావు. ఉద్యమంలోనే కాదు.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేస్తామంటూ సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజాసేవలో ఎప్పుడు ప్రత్యేక వైఖరిని అవలంబిస్తూ ప్రజలకు మరింత చేరువవుతారు. తన సొంత నియోజకవర్గ ప్రజల సంక్షేమం విషయంలో కూడా ఆయన ఇతరులకంటే చాలా యాక్టివ్.అందుకే పోటీ చేసిన ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ వస్తున్న హరీశ్ తాజాగా అరుదైన రికార్డుకు చేరవయ్యారు.
దేశంలో అతిచిన్న వయస్సులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం హరీశ్ వయస్సు 46 సంవత్సరాలు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 80 శాతం పోలింగ్ నమోదు కావడంతో..హరీష్ లక్ష ఓట్లో మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అంచనా. గత ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు.
సంకల్పం ఉంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి నేతలకు ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ప్రస్తుతం సిద్ధిపేట యావద్దేశానికే ఉదాహరణగా నిలుస్తోంది. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజక వర్గం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. ఈ గొప్ప
మార్పుకు చరిత్రకు కారణం సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గ సభ్యుడు మంత్రి హరీష్ రావు కారణభూతులయ్యారు.
గతంలో ఈ రికార్డు కేరళకు చెందిన కేఎం మణి పేరుమీద ఉంది. ఆయన 49వ సంవత్సరంలో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక రాష్ట్రం నుంచి 50 ఏండ్ల వయసులో కేసీఆర్ ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా మొత్తం ఏడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి 63 ఏండ్ల వయసులో,దివంగత బాగారెడ్డి 53 ఏండ్ల వయసులో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
దేశంలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, కేరళకు చెందిన కాంగ్రెస్ నేత కేఎం మణి పేరుమీద ఉన్నది. వీరిద్దరూ 13సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు 11 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా వరుసగా 23 ఏండ్లపాటు సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే మహారాష్ట్రలోని గుల్బర్గా నియోజకవర్గం నుంచి 1972-2009 వరకు వరుసగా తొమ్మిదిసార్లు విజయఢంకా మోగించారు.