సిద్దిపేట జిల్లా కేంద్రం కాలానికి అనుగుణంగా ఇక్కడ ఎస్ బి ఐ, ఆంద్ర బ్యాంక్ రీజినల్ ఆఫీసలు రావడం జరుగతుందనీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట బై పాస్ రోడ్డులో నూతనంగా నిర్మించే ఎస్ బి ఐ ప్రాంతీయ కార్యాలయ భవన నిర్మణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది అని.. ఒక్కకొటగా చేసుకుంటూ సిద్దిపేట బై పాస్ రోడ్డులో ఈ రహదారి వెంట బిజినెస్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.. అప్పుడే ఈ రహదారి బిజినెస్ స్ట్రీట్‌గా మారుతుందన్నారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాలలో ముందంజలో ఉంది.. ఎస్ బి ఐ బ్యాంక్ ఉద్యోగుల నివాసం కోసం అవసరమైన స్థలం కూడా కేటాయిస్తాం అని చెప్పారు. ఏడాదిలో ఈ భవనాన్ని ప్రారంభించడానికి సిద్ధం చేయలన్నారు. 20- 20 – 20లో ఈ భవనం ప్రారంభం చేసుకుందాం అని అన్నారు.
గతంలో రీజినల్ ఆపీస్‌లో పని ఉంటే హైదరాబాద్ వరకు వెళ్లి ఇబ్బంది పడేవారు. ప్రజలు రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ లోనే ట్రాంజక్షన్ జరపాలని కేంద్రము భావిస్తుంది. ఇక్కడ త్వరలోనే రీజినల్ ఏడీబీ వస్తుందన్నారు. చీఫ్ మేనేజర్ మిశ్రాను అభినందించారు. గత ఏడాది సిద్దిపేటకు క్లిన్ గ్రీన్ సిద్దిపేటగా అవార్డ్ వచ్చిందని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉంది. రాబోయే రోజుల్లో సిద్ధిపేటలో ఆంద్ర బ్యాంక్ రీజినల్ ఆఫీసు కూడా రావడం జరుగతుందన్నారు. సిద్దిపేట పట్టణంలో రైల్వే లైన్, పోలీస్ కమిషనరేట్, కలెక్టరేట్, రెండు మెడికల్ కాలేజీలు,ఫారెస్ట్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం రావడంతో ఎంతో పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు.
నూతనంగా నిర్మించే కలెక్టరేట్, మెడికల్ కళాశాలలో ఎస్‌బిఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలోని 30 స్వయం సహాయక సంఘాలకు కోటి యాభై లక్షలు మరియు 20 డైరీ యూనిట్స్ కి 20 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. 26 సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గ్రూపులకు రూపాయాలు 10.05 కోట్లల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి,ఎస్‌బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రకాష్ మిశ్రా,పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, మునిసిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.