పార్టీ కార్యకర్త పాడె మోసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే..

190
MLA hanmanth shinde
- Advertisement -

టీఆర్‌ఎస్ సీనియర్ నేత, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాడె మోశారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే.. పాడె మోసి అతనిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలం పోచారం తండాకు చెందిన సీనియర్ తెరాస నాయకుడు పాక్రే కర్తార్ నాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కర్తార్‌ నాయక్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హన్మంత్ షిండ్ వెంటనే పోచారం తండాకు చేరుకున్నారు.

ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన కర్తార్ నాయక్ అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే.. పాడెను సైతం మోశారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. అలాగే కర్తార్ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కర్తార్ నాయక్ అంతిమయాత్రలో ఎమ్మెల్యే‌తో పాటు, పలువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక, పార్టీకి చెందిన నాయకుడి అంతిమయాత్రలో పాల్గొనడమే కాకుండా.. పాడె మోసిన ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేను పలువురు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

- Advertisement -