రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం: గువ్వల బాలరాజు

63
balaraju
- Advertisement -

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని తెలిపారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. మీడియాతో మాట్లాడిన ఆయన…కాంగ్రెస్ బిజెపి నేతలు మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. బిజెపికి దమ్ముంటే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని మార్చాలని చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇన్నెళ్ళయినా బడుగు బహీనవర్గాల్లో ఎందుకు మార్పు రాలేదన్నారు.

అంబేద్కర్ ను అవమానపర్చిన వారు ఇవ్వాళ మాట్లాడుతున్నారు…ముఖ్యమంత్రి ఏ అంశమైనా పూర్తి అవగాహనతో మాట్లాడుతారన్నారు. రాజ్యాంగ విలువలకు కేంద్రం తూట్లు పొడుస్తోందని…కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందన్నారు. బడ్జెట్ తో సామాన్య జనానికి ఒరగబెట్టింది ఏమిలేదు…అంబేద్కర్ స్పూర్తితో దళితుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది మా ప్రభుత్వం అన్నారు.

అంబేద్కర్ చిత్ర పటాన్ని ఎడమ చేతితో పక్కతోసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డ బాలరాజు..రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కటిన చట్టాలు తేవాలన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. ఒక చర్చకు ముఖ్యమంత్రి పునాది వేశారు….అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా ముందుకు పోయే పార్టీ టిఆర్ఎస్ కాదు అన్నారు.ముఖ్యమంత్రి నిర్ణయానికి మేము మద్దతుగా ఉంటాం….అవసరం అయితే దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం అన్నారు. మేధావులను, రీసెర్చ్ స్కాలర్స్ ను పిలిచి చర్చ చేయండి…95 నుంచి 105 సీట్లు తప్పకుండా గెలుస్తాం అన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలు ముఖ్యమంత్రి పై నిరసనలు ఆపకపోతే గ్రామాల్లో తరిమి కొడతాం అని హెచ్చరించారు.

- Advertisement -