గండ్ర దంపతులకు కరోనా..

68
gandra
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

నిన్న జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు గండ్ర దంపతులు.. దీంతో.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక, తమతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కోవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గండ్ర దంపతులు.

జిల్లాలో పంట నష్టంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇతర నేతలతో కలిసి పర్యటించారు గండ్ర దంపతులు. మంత్రులతో కలిసి పరకాల నుండి నర్సంపేటకు హెలికాప్టర్‌లో వెళ్లారు. దీంతో వీరిలో కూడా టెన్షన్ నెలకొంది.

- Advertisement -