జలసౌధలో ఎమ్మెల్యే ఈటెల సమీక్ష..

229
- Advertisement -

ఎమ్మెల్యే, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ ఎస్సారెస్పీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలసౌధలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై సమీక్ష ఆయన మాట్లాడారు. ఎస్సారెస్పీ ద్వారా 14 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో 5 లక్షల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించామని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. అధికారికంగా చెరువులు, కుంటలు నింపాలని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు.

MLA Etela Rajender

దీంతో భూగర్భ జలాలు, మత్స్య సంపద పెరుగుతుందని పేర్కొన్నారు. జూన్ 30 వరకు కేటాయించిన నిధులు 100 శాతం ఖర్చు చేస్తామన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చుకుంటామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఎండాకాలంలో రైతాంగానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామన్న ఈటల రాజేందర్.. రబీకి ఫిబ్రవరి 10 నుంచి ఒక విడుత పంటలకు నీళ్లు ఇస్తామని ఈటల రాజేందర్ ప్రకటించారు.

ఈ సమీక్షలో ఈఎన్‌సీ మురళీధర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వడితేల సతీశ్, రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్, సీతక్కతో పాటు పలువురు పాల్గొన్నారు. రబీ సాగుకు కావాల్సిన నీళ్లు, రెండో దశ కాల్వల పనుల పురోగతిపై సమీక్షించారు.

- Advertisement -