4 మిలియన్ల….. స్పైడర్

196
mahesh twitter 4 million followers
- Advertisement -

ట్విట్టర్‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న టాలీవుడ్ న‌టుడు మ‌హేశ్ బాబు త‌న దూకుడుని కొన‌సాగిస్తున్నాడు. తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య నాలుగు మిలియ‌న్ల‌ను దాటేసింది. మహేష్‌ను ట్విట్టర్‌లో నలభై లక్షల మంది ఫాలోఅవుతుండగా ఆయన మాత్రం ఫాలో అయ్యేది ఒక్కరినే. అది ఎవరో  తెలుసా ఆయన బావ..గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ని. ట్విట్ట‌ర్‌లో అత్య‌ధిక మంది పాలోవ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ మ‌హేశ్ బాబు మాత్రం అరుదుగానే ట్వీట్లు చేస్తుంటాడు.

త‌న కుటుంబం, త‌న సినిమాల‌కు సంబంధించిన ముఖ్య‌మైన స‌మాచారంపైనే ఆయ‌న స్పందిస్తుంటారు. తాజాగా స్పైడర్‌ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ప్రొమోని షేర్ చేశాడు మహేష్. ఇటీవ‌ల త‌న సినిమాలోని ఎస్పీవై ర‌య్ ర‌య్ ర‌య్ అనే పాట‌కు త‌న కూతురు సితార పెద‌వులు క‌దిలించిన వీడియోను షేర్ చేయ‌గా అది వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ సైతం ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే.  శుభాకాంక్ష‌లు తెల‌పాల‌న్నా, ఏ విషయాన్నయినా విమ‌ర్శించాల‌న్నా, ఉద్య‌మానికి పిలుపునివ్వాల‌న్నా ఆయ‌న ట్విట్ట‌ర్‌నే వేదిక‌గా చేసుకుంటున్నారు ప‌వ‌న్. దీంతో ఆయ‌న‌ను ట్విట్ట‌ర్ లో ఫాలో అవుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న‌ది.. తాజాగా ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 20 ల‌క్ష‌ల మందికి చేరింది.

- Advertisement -