శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, సీనియర్ వైసిపి నేత శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నగర పరిధిలో 100 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తే రాద్దాంతం దేనికని ఆయన ప్రశ్నించారు. అందులో పెద్ద విషయం ఏముందన్నారు. ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తోంది దానికీ ప్రజలు సహకరించ వలసింది పోయి లేని పోని రాద్దాంతాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కార్పొరేషన్‌లో ఆహ్లాదకర వాతావరణంతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఇంటి నుండి చెత్త తీసుకువెళ్లేందుకు వంద రూపాయలు వసూలు చేస్తే అందులో తప్పేముందన్నారు. పన్ను కట్టని వారి చెత్త తీసుకెళ్ళం. చెత్త వారి ఇంటి ముందే పోసేస్తాం. అది అనుభవించండి తెలుస్తుందని అన్నారు. ప్రజలకు అనేక పధకాలకు ప్రభుత్వం డబ్బులు పంచాలి.. కానీ మనం డబ్బులు కట్టము అంటే ఎలా ? అని ప్రశ్నించారు. సచివాలయ సిబ్బంది, అధికారులు నాయకులు చెత్త పన్ను కట్టించే దిశగా పనిచేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు.